Searching...
Friday 28 June 2013

మహేశ్ కి అక్కడా తిరుగులేదు

మహేశ్ కి అక్కడా తిరుగులేదు!రిన్స్ పేరు చెబితేనే యువత ఉత్సాహంగా ఊగిపోతుంటారు. అమ్మాయిలు కలల్లో తేలిపోతుంటారు. టాలీవుడ్ అందగాడు ఎవరంటే మొదట వచ్చేది మహేశ్ పేరే. అందరికంటే క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే అప్పుడు చెప్పేదీ అతడి పేరు. అయితే మహేశ్ బాబుకి మనం మాత్రమే ఫ్యాన్స్ కాదు. విదేశాల్లో ఉన్న చాలామంది కూడా ఫ్యాన్సే. ఆ ఫాలోయింగ్ ఎంత ఉందనేది ఈ మధ్యనే తెలిసింది.

సుకుమార్ దర్శకత్వం మహేశ్  నటిస్తోన్న సినిమా షూటింగ్ ఐర్లాండులో జరగుతోంది. అక్కడి బెల్ ఫాస్ట్ అనే నగరంలో ఓ భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశాడు దర్శకుడు. షూటింగుకి అంతా సిద్ధమైంది. అంతలోనే కొందరు అపరిచిత వ్యక్తులు వచ్చేశారు. వారంతా ఎవరా అని ఆరాతీస్తే తెలిసింది... మహేశ్ బాబు ఫ్యాన్స్. అందరూ అతడిని చుట్టుముట్టేశారు. కబుర్లలో ముంచెత్తారు. ఆటోగ్రాఫులు తీసుకున్నారు. కరచాలనాలు చేసి మురిసిపోయారు. ఈ దేశంలో మహేశ్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారట. ప్రిన్స్ కూడా కాస్త షాక్ తిన్నాడట అంతమంది ఫ్యాన్స్ ని చూసి. మహేశా మజాకా!

0 comments:

Post a Comment

 
Back to top!