Searching...
Friday, 28 June 2013

ప్రొడ్యూసర్ గారి పొలిటికల్ ప్లాన్స్


ప్రొడ్యూసర్ గారి పొలిటికల్ ప్లాన్స్!
సినిమాని హిట్ చేసే ఫార్ములా బాగా తెలుసు బండ్ల గణేష్ కి. అందుకే అతడు పట్టిందల్లా బంగారమవుతోంది. ఏ సినిమా తీసినా సూపర్ డూపర్ హిట్టయి కూచుంటోంది. అయితే కేవలం సినిమాయే కాదు, తనకు పొలిటికల్ ఫార్ములాలు కూడా తెలుసంటున్నాడు గణేష్. వచ్చే యేడు జరిగే ఎన్నికల్లో ఈ నిర్మాత గారు పోటీ చేయనున్నాడని తెలుస్తోంది.

గణేష్ కి పొలిటికల్ లీడర్స్ అండ ఉందనేది ఎప్పట్నుంచో అనుకుంటున్న మాటే. బొత్స సత్యనారాయణకు ఇతగాడు బినామీ అని, సీన్లో ఉన్నది ఇతడైనా తెర వెనుక ఉండి నడిపిస్తున్నది బొత్యయేనని బాహాటంగానే మాట్లాడేవాళ్లు ఉన్నారు. అయితే అవన్నీ నిజం కాదని అటు బొత్య, ఇటు గణేష్ తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చేరడానికి పావులు కదుపుతున్నాడంటే, ఆ మాటలు నిజమేననిపిస్తోంది. షాద్ నగర్ నియోజక వర్గం మీద కన్నేసిన మనోడు, ఆ దిశగా అడుగులు వేయడానికి కాంగ్రెస్ వారితో కలసి చర్చలు జరుపుతున్నాడు. అతడికి బొత్సతో పాటు చిరంజీవి సపోర్ట్ కూడా ఉందని తెలుస్తోంది. ఇంకేం... ఇంత ప్రోత్సాహం ఉన్నప్పుడు మనోడు ఆగుతాడా! ఈజీగా ఎమ్మెల్సే టికెట్ పట్టేస్తాడు. ఏమంటారు!

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Back to top!